వంశీకృష్ణ గెలిస్తే రామగుండంలో మరింత అభివృద్ధి : మక్కన్​సింగ్​రాజ్​ఠాకూర్​

వంశీకృష్ణ గెలిస్తే రామగుండంలో మరింత అభివృద్ధి : మక్కన్​సింగ్​రాజ్​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: కాకా మనుమడు, యువనేత గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే మక్కన్​సింగ్​రాజ్​ఠాకూర్​అన్నారు. గురువారం సింగరేణి ఆర్జీ 2 డివిజన్​ పరిధిలోని వకీల్‌‌‌‌‌‌‌‌పల్లి మైన్​, ఏరియా వర్క్​షాప్​లో ఐఎన్​టీయూసీ, కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్​ మీటింగ్​లో ఆయన పాల్గొన్నారు. అలాగే అంతర్గాం మండలం లింగాపూర్​ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు, ప్రజలను కలిశారు. బల్దియా పరిధిలోని 15, 16, 17, 18, 19వ డివిజన్లలో నిర్వహించిన కార్నర్​ మీటింగుల్లో పాల్గొని మాట్లాడారు.

2015లో సింగరేణి ప్రైవేటీకరణ బిల్లుపై పార్లమెంట్​లో బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్​ ఎంపీలు మద్దతు తెలిపారన్నారు. సాయంత్రం గోదావరిఖనిలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్​లో చేరగా వారికి మంత్రి శ్రీధర్​బాబు, ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్​అనిల్​ కుమార్, మంథని మున్సిపల్​ చైర్మన్​ రామిరెడ్డి, కార్పొరేటర్లు బొంతల రాజేశ్, స్వామి, సుజాత, ముస్తఫా, లింగస్వామి, శంకర్​నాయక్​, శంకర్​, తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తోనే పేదలకు న్యాయం

పెద్దపల్లి, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తోనే పేదలకు న్యాయం జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల, పెద్దబొంకూర్, చీకురాయి, రాంపల్లి, ముత్తారం, గౌరెడ్డిపేట గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ పార్లమెంటు  అభ్యర్థిగా గడ్డం వంశీ కృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. అంతకుముందు జిల్లాకేంద్రంలో పద్మశాలీ సంఘ లీడర్లు ఆడెపు సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వల్స నీలయ్యతోపాటు సుమారు 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అమలుచేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నారన్నారు. అనంతరం కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన బీఆర్​ఎస్​ లీడర్లు శ్రీనివాస్ గౌడ్, సతీశ్‌‌‌‌‌‌‌‌ పార్టీలో చేరారు.