
ముంబయితో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడి 8 గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో ఉంది గుజరాత్. ప్లే ఆఫ్ రేసులో ముందంజలో ఉంది గుజరాత్.
ఇక 11 మ్యాచ్ లు ఆడి 6 గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది ముంబై. ముంబై ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముంబై ఇంకో రెండు మ్యాచ్ లు గెలవాలి. గుజరాత్ పై గెలిస్తే ముంబై ఇండియన్స్ పై ఒత్తిడి తగ్గుతుంది. లేకుంటే తన చివరి రెండు మ్యాచ్ లలో లక్నో, హైదరాబాద్ తో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(w), రోహిత్ శర్మ(c), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, నూర్ అహ్మద్