ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఆరునెలల జైలు శిక్ష

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఆరునెలల జైలు శిక్ష

హైదరాబాద్ ఖైరతాబాద్ TRS ఎమ్మెల్యే దానం నాగేందర్ కు జైలు శిక్ష ప‌డింది. ఆరు నెలల శిక్షతోపాటు, వెయ్యి రూపాయ‌ల‌ జరిమానా విధించింది ప్రజా ప్రతినిధుల కోర్టు.

2013లో బంజారాహిల్స్ లో నమోదైన కేసులో దానం నాగేందర్ ను దోషిగా తేల్చింది  కోర్టు. ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచార‌నే ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పీలుకు వెళ్ళేందుకు అనుమతించిన కోర్టు.. శిక్ష అమలను నెల రోజులు వాయిదా వేసింది.