Salaar Bike: సలార్ బైక్ SMS కాంటెస్ట్‌లో విన్నర్ని ప్రకటించిన స్టార్ మా

Salaar Bike: సలార్ బైక్ SMS కాంటెస్ట్‌లో విన్నర్ని ప్రకటించిన స్టార్ మా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన తాజా చిత్రం సలార్(Salaar).కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్,ఓటీటీలో రిలీజై భారీ సక్సెస్ ని అందుకుంది.

అయితే రీసెంట్ గా స్టార్ మాలో (టీవీ) ప్రేక్షకుల ముందుకు వచ్చి అక్కడ కూడా దుమ్ములేపుతోంది.అయితే టీవీలో ఈ సినిమా చూస్తూనే..ప్రభాస్ వాడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి బైక్ గెలుచుకునే అవకాశం స్టార్ మా కల్పించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ పోటీలో గెలిచిన విన్నర్ ను స్టార్ మా ప్రకటిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది."సలార్ బైక్ SMS కాంటెస్ట్‌లో పాల్గొని బైక్‌ను గెలుచుకున్న విజయవాడకి చెందిన వరప్రసాద్‌కు అభినందనలు!..మీ విజయాన్ని జరుపుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాము మరియు మీరు మీ కొత్త రైడ్‌ని ఆనందిస్తారని ఆశిస్తున్నాము! స్టార్ మాతో మెరుస్తూ,గెలుస్తూ ఉండండి!"అంటూ తెలిపింది.ఈ సందర్బంగా సలార్ ఐకానిక్ మోటార్‌సైకిల్‌ను గెలుచుకున్న వరప్రసాద్ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. 

ఈ సినిమాను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్  ట్వీట్ చేస్తూ.."సలార్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నడిపిన..అదే ఐకానిక్ మోటార్‌సైకిల్‌ను గెలుచుకున్న వారికి విషెస్ తెలిపింది.ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫొటోస్,వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.