జనాలకు సోల్​మెట్​ దొరకడం చాలా కష్టం.. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా..

జనాలకు  సోల్​మెట్​ దొరకడం చాలా కష్టం.. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా..

జీవితాంతం తోడుండే ఒక వ్యక్తి కోసం తాపత్రయపడతాం కదా!. అదిగో ఆ ఆ వ్యక్తినే వ్యక్తినే 'సోల్మేట్' అంటరు. 'విడదీయరాని ప్రేమ’, 'అనిర్వచనీయమైన అనుబంధం'.. సోల్మే టికి కాలక్రమంలో పర్యాయపదాలుగా మారిపోయాయి. ఇంతకీ సోల్మేట్ వెతు క్కోవడాన్ని మీరూ నమ్ముతారా?. ఒకవేళ నమ్మితే వెంటనే ఆ ఆలోచనను మానుకో వడం మంచిదంటున్నారు సైకాలజిస్టులు. ఎందుకంటే సోల్మేట్ దొరుకుడు ఇప్పుడు ముష్కిల్ ఐతందని వారంటున్నారు. నిజానికి సోల్మేట్ అనే వ్యవహారం మనం ఊహించినంత సులువుగా ఉండదట.

రిలేషన్షిప్  లేనిపోని సమస్యలు సృష్టిస్తుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'పర్ఫెక్ట్ మ్యాచ్, జీవితాంతం చెప్పిన మాట వినాలి. అనుక్షణం ప్రేమను పంచాలి. ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి.. ఇట్లాంటి కండిషన్లు పెట్టుకుంటే సోల్మేట్ దొరకడం చాలా కష్టమని కొన్ని పరిశోధనల్లో రుజువైందని మానసిక నిపుణులుచెబుతున్నారు.   'పార్ట్ నర్ గొడవ పడకూడదు' అనుకోవడం వాస్తవానికి చాలా దూరమైన వ్యవహారం. కానీ, చాలా మంది, సోల్మేట్ తమ దగ్గర అణిగిమణిగి ఉండాలని కోరుకుంటారు. ఈ భావన వల్ల కలతలు చెలరేగుతాయే తప్ప.. జీవితంలో ప్రశాంతత ఉండదని సైకాలజిస్టులు వివరిస్తున్నారు. 

హెల్దీ రిలేషన్ షిప్.. నాశనం 

నిజానికి సోల్మేట్ అనేది ఓ మాయా అనుభూతి. ఈ ఫీలింగ్ ఉన్నవాళ్లు తమ అంచనాలను భాగస్వామి అందుకోలేనప్పుడు నిరుత్సాహపడతారు. పరిధి దాటి అనుమానాలు పెంచుకుంటారు. ఈ ఒడిదుడుకులతో జీవితాంతం ప్రయాణం సాఫీగా కొనసాగించలేరు. ఒక్కోసారి ఈ నమ్మకం హెల్దీ రిలేషన్ను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్షణికావేశంలో జరిగే ఘటనల ఆధారంగా 'నువ్వు నాకు కరెక్ట్ కాదు' అనడం కరెక్ట్ కాదని క్లాపో అంటోంది. 

అసలు ఇదంతా ఎందుకు..  సోల్మేట్ అనే వ్యవహారానికి దూరంగా ఉన్న జంటలు ఏళ్ల తరబడి హాయిగాకలిసి ఉంటున్నారు. ఇక ప్రతీ క్షణం ప్రేమను పంచడం అంటారా?.. అది ప్రతీ క్షణం బ్రష్ చేసుకోవడం, ప్రతీ క్షణం టీవీ చూడటం.. లాంటిదే అన్నమాట. . .