ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా తెలంగాణ వదిలి వెళ్లిపోతా

ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా తెలంగాణ వదిలి వెళ్లిపోతా

CAA వల్ల భారత ముస్లిం ప్రజలకు ఏ ఒక్కరికీ ఇబ్బంది ఉండదని, కొంతమంది వాళ్ళ స్వార్థం కోసమే గందరగోళం సృష్టిస్తున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. సోమవారం అసెంబ్లీలో NRC-CAA పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. సీఏఏతో దేశ ప్రజలకు ఎవ్వరికీ ఎలాంటి సమస్య ఉండదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ బిల్లు పై గతంలోనే స్పష్టత ఇచ్చారన్నారు. సభలో TRS- MIM పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, అసెంబ్లీ సాక్షిగా ఆ రెండు పార్టీలు అబద్ధాలు చెప్తున్నాయన్నారు. NRC-CAA వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది వచ్చినా తాను అసెంబ్లీలో ఉండనని చెప్పారు రాజాసింగ్.  TRS పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని, స్పీకర్ పోడియం వద్ద ఆయన నిరసన తెలిపారు న ఎమ్మెల్యే రాజా సింగ్. పోడియం వద్ద గొడవ చేస్తుండగానే CAA కి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించడంతో ఆ తీర్మాన కాపీని రాజాసింగ్ చించేశారు. అంతకుముందు సభలో మిగిలిన పార్టీ సభ్యులకు గంట సమయం ఇస్తున్నారని..తమకు అలానే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ని కోరారు రాజాసింగ్.

MLA Raja singh comments on the debate on the NRC-CAA in the Assembly