తెలంగాణ శాసనమండలిలో తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుపై గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్యనే బిల్లును ప్రవేశపెట్టింది ప్రభుత్వం. సోమవారం ( మార్చి 30 ) సభలో బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి అడ్లూరి. ఈ క్రమంలో చైర్మెన్ పోడియం దగ్గరికి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ సభ్యులు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సభ్యులు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. తల్లిదండ్రుల సంరక్షణ బిల్లును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని అన్నారు.
గొప్ప బిల్లుకు అడ్డుపడితే..బీఆర్ఎస్ ను ప్రజలు క్షమించరని అన్నారు అద్దంకి. దొంగలే దొంగా అన్నట్టుగా బీఆర్ఎస్ తీరు ఉందని మండిపడ్డారు. పెద్దల సభలో బీఆర్ఎస్ హుందాగా వ్యవహరించటం లేదని అన్నారు. ముందే ప్లాన్ చేసుకొని సభకు వచ్చి గొడవ చేస్తున్నారని.. ప్రజలకు ఉపయోగపడే బిల్లును అడ్డుకుంటున్నారని అన్నారు అద్దంకి.దళిత మంత్రి బిల్లును ప్రవేశపెడుతోంటే బీఆర్ఎస్ అడ్డుపడుతోందని అన్నారు.
అసెంబ్లీలో హల్చల్ చేసి వార్తల్లో నిలవాలనే చీప్ టాక్టిక్స్ తో బీఆర్ఎస్ తన ప్రతిష్ట దిగజార్చుకుంటోందని అన్నారు అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే ఎమ్మెల్సీలు దిగజారి ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇలాంటి గొప్ప బిల్లు పట్ల బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని అన్నారు అద్దంకి.
