మొబైల్ జాతకం

మొబైల్ జాతకం

ఈ రోజుల్లో సాధారణంగా ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై పోయింది. అయితే ఈ ఫోన్ తో చాలా ప్రయోగాలు చేయవచ్చని ఇటీవల కొంతమంది నిపుణులు తెలిపారు. ఫోన్ పట్టుకునే విధానాన్ని బట్టి మీ జాతకం చెప్పేయొచ్చట.

వేలు ఉపయోగించి పట్టు కోవడం...

ఇలా ఫోన్ పట్టు కునే వారు జీవితంలో ఏ సమస్యనైనా అవలీలగా అధిగమిస్తారట. కాన్ఫిడెన్స్ అనేది వీరి నరనరాల్లో జీర్ణించుకుని ఉంటుందట. రిలేషన్ షిప్ కి తొందరగా అట్రాక్ట్ అవ్వరు. ఒకవేళ అయితే దాన్ని జీవితంలో వదిలిపెట్టరట.

వేలితో స్క్రోల్ చేస్తూ టైప్ చేయడం..

ఫోన్ పట్టు కునే విధానంలో మీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. వేలుతో పట్టుకుని దాని స్క్రోల్ చేస్తూ టైప్ చేసేవారు చాలా సెన్సిటి వ్ గా ఉంటారట. ఈ రకమైన మనస్తత్వం కలవారు ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటారట.బంధాలను చూసి కలుపుకుం టారట.

రెండు వేళ్లతో టైపింగ్…

ఇలా ఫోన్ పట్టు కునే వారు సెకండ్లలో సమస్యలను సాల్వ్ చేసుకునే కెపాసిటీ కలిగి ఉంటారట. పనులు అత్యంత వేగంగా చేయడంలో వీరు నేర్పరులు. అయితే వీరు పనిచేసే చోట ఒడిదుడుకులను ఎదుర్కుంటారట.ఎదుటివారి మనసును గెలుచుకోవడంలో కొంచెం వీక్ గా ఉంటారట.

ఇండెక్స్ ఫింగర్…

ఇలా ఫోన్ వాడేవారు మంచి క్రియేటివి టీని కలిగి ఉంటారు. పనిచేసే చోట సరికొత్త క్రియేటివిటితో ఉంటారు. ఇతరులను ఆకట్టు కోవడంలో చాలా ఫాస్ట్ గా ఉంటారు. రిలేషిన్ షిప్ లో ముందుగా వీరు అట్రాక్ట్ చేసి ఆ తరువాత వారితో సంబంధాలను కొనసాగిస్తారట.