- 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని సీఐటీయూ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించాలని, 24 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేశ్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వద్ద మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ... సుమారు 13 ఏండ్లుగా అతి తక్కువ వేతనాలతో, వెట్టిచాకిరీ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నాన్ టీచింగ్ ఉద్యోగులకు కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాలని కోరారు. హాస్టల్ ఉద్యోగులకు జీవో 60ని వర్తింపజేయాలన్నారు.
