జొమాటో కో ఫౌండర్ రాజీనామా

జొమాటో కో ఫౌండర్ రాజీనామా

ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోకు పెద్ద షాక్ తగిలింది. కంపెనీ కో ఫౌండర్, సీఈఓ మోహిత్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. జొమాటోకు బెస్ట్ విషెస్ చెప్పిన ఆయన.. దీర్ఘకాలిక పెట్టుబడిదారుగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఏళ్లుగా నేర్చుకున్న అనుభవాన్ని కొనసాగించాలని, నిత్య విద్యార్థిగా సంస్థను ప్రపంచానికి రోల్ మోడల్గా నిలపాలని మోహిత్ తన ఫేర్వెల్ మెసేజ్ లో చెప్పారు. 

కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలోనూ సవాళ్లను ఎదుర్కొని జొమాటోను లాభదాయకంగా మార్చేందుకు దీపిందర్ గోయెల్ కృషి చేశారని మోహిత్ ప్రశంసించారు. ఇన్నేళ్లలో దీపిందర్ మరింత పరిణితి చెంది లీడర్ గా మారడం చూశానని అన్నారు. ఉద్యోగులతో కలిసి ఆయన వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా నడిపించే సామర్థ్యం కలిగి ఉన్నాడని మోహిత్ అభిప్రాయపడ్డారు.

మోహిత్ రాజీనామాపై జొమాటో స్పందించింది. ఆయన స్వచ్ఛందంగానే తన పదవికి మోహిత్ రాజీనామా చేశాడని స్పష్టతనిచ్చింది. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తామని, పదవిలో కొనసాగాలని ఒత్తిడి తీసుకురాలేదని చెప్పింది. 2008 దీపేందర్ గోయెల్తో కలిసి మోహిత్ గుప్తా జొమాటో ప్రారంభించారు.