టాటా కార్లపై డిస్కౌంట్లు

టాటా కార్లపై డిస్కౌంట్లు
  • కొన్నింటిపై రూ.65 వేల వరకు డిస్కౌంట్
  • ఈ నెలాఖరు వరకు ఆఫర్లు

న్యూఢిల్లీ: కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ కొన్ని మోడల్స్‌‌‌‌పై ఆఫర్లను, డిస్కౌంట్లను అందిస్తోంది. ఇవి క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆపర్లు ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. హారియర్, నెక్సాన్ ఈవీ, టియగో , టైగోర్‌‌‌‌ కార్లను కొనే ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అవకాశం. అయితే సఫారీ , అల్ట్రోజ్‌‌‌‌లపై ఎటువంటి తగ్గింపులూ ఇవ్వడం లేదు. డిస్కౌంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఆథరైజ్డ్ టాటా మోటార్స్ డీలర్‌‌‌‌షిప్‌‌‌‌ల నుండి తీసుకోవచ్చు. మోడల్స్ వారీగా ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

టాటా నెక్సాన్, టాటా టియగో:  నెక్సాన్  డీజిల్ వేరియంట్లు రూ .15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌‌‌‌తో లభిస్తాయి. టియగోపై జూన్ 30 వరకు  రూ .15 వేల క్యాష్ డిస్కౌంట్, రూ .1 0వేల ఎక్స్ఛేంజ్ బోనస్  ఉంది.

టాటా హారియర్, టాటా నెక్సాన్ ఈవీ: హారియర్‌‌ డార్క్ ఎడిషన్ , కామో మోడళ్లను రూ.40వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌‌‌‌తో కొనుగోలు చేయవచ్చు.  టాటా నెక్సన్‌ ఎలక్ట్రిక్ వెహికల్‌‌‌‌పై రూ .15 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు. టాటా టైగొర్‌‌‌‌పై రూ.15 వేల క్యాష్ డిస్కౌంట్, రూ .15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తాయి.

ఎలక్ట్రిక్ ఆల్ట్రోజ్ వస్తోంది... 
ఆల్ట్రోజ్  ఎలక్ట్రిక్ వెహికల్‌‌‌‌(ఈవీ) వేరియంట్‌‌‌‌ను కూడా టాటా మోటార్స్ తయారుచేస్తోంది. ఈ హ్యాచ్‌‌‌‌బ్యాక్ ప్రస్తుతం ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్స్ఎం+ సహా మూడు మోడళ్లలో అందుబాటులో ఉంది. ఈ మూడు ట్రిమ్‌‌‌‌లు డీజిల్ , పెట్రోల్ ఇంజన్లతో అందుబాటులో ఉన్నాయి.  టాటా ఆల్ట్రోజ్ ఈవీని ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌‌‌‌డ్ (ఆల్ఫా) ఆర్కిటెక్చర్ తో డెవలప్ చేశారు. జిప్‌‌‌‌ట్రాన్ పవర్‌‌‌‌ట్రెయిన్ టెక్నాలజీ కూడా ఉంటుంది.  ఇందులో ఐపీ67  లిథియం- అయాన్ బ్యాటరీని అమర్చారు. దీనిని తొలిసారిగా 2019 లో జరిగిన జెనీవా మోటార్ షోలో చూపించారు.