కాలనీల్లో కుక్కలు, ఆస్పత్రుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నయి: ఎంపీ అర్వింద్

కాలనీల్లో కుక్కలు, ఆస్పత్రుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నయి: ఎంపీ అర్వింద్

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ ఎంపీ ఆర్వింద్ ఆరోపించారు. కాలనీల్లో కుక్కలు, ఆస్పత్రుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని విమర్శించారు. మరోవైపు హాస్టళ్లలో  విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని అన్నారు. మైనార్టీ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటానని ఆయన చెప్పారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయని అర్వింద్ అన్నారు. 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే పసుపు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఎంపీ అర్వింద్ చెప్పారు. కొన్ని దేశాలు దిగుమతులు నిలిపివేయడం వల్లనే పసుపు ధర పడిపోయిందని ఆయన స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటలకు ధరలు తగ్గినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం  ఎంఎస్ పి పథకం అమలు చేయాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న అన్ని పథకాలు యధావిధిగా కొనసాగిస్తూ.. కొత్త పథకాలు అమలు చేస్తామని ఎంపీ అర్వింద్ హామీ ఇచ్చారు.