రాముడిని లూటీ చేశారు.. దేశాన్ని దోచుకున్నారు: బీజేపీపై ఎంపీ కపిల్ సిబల్ ధ్వజం

రాముడిని లూటీ చేశారు.. దేశాన్ని దోచుకున్నారు: బీజేపీపై ఎంపీ కపిల్ సిబల్ ధ్వజం

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల చోరీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ సోమవారం ‘ఎక్స్’ వేదికగా బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "ఈ ప్రభుత్వాన్ని ఓడించండి.. వీరు దేశాన్ని దోచుకోవడమే కాకుండా, ఆఖరికి రాముడిని కూడా లూటీ చేశారు. మోదీ ప్రభుత్వ ‘అచ్చే దిన్’ నినాదం ఒక పెద్ద అబద్ధం" అని విమర్శించారు. 

అందరం కలిసి దేశాన్ని ఏకం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ పెద్ద కుంభకోణంపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని విపక్షాలు తప్పుబడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. రామమందిరం కోసం ప్రతి భారతీయుడు విరాళం ఇచ్చారని, ఇది ఆర్థిక కుంభకోణం మాత్రమే కాదు ప్రజల నమ్మకాన్ని వంచించడమేనని కాంగ్రెస్ మండిపడింది.