వాజపేయి విలువలతో కూడిన రాజకీయాలు చేశారు : లక్ష్మణ్

 వాజపేయి  విలువలతో కూడిన రాజకీయాలు చేశారు : లక్ష్మణ్

తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 98వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజపేయి చిత్రపటానికి పూలామాలవేసి నివాళులర్పించారు.  దేశంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చామంటే అది  వాజపేయి నేర్పిన సిద్ధాంతాలేనని అన్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోతామని తెలిసి కూడా వాజపేయి వెనక్కి వెళ్ళలేదని లక్ష్మణ్ గుర్తుచేసుకున్నారు. 

వాజపేయి  విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్న లక్ష్మణ్...  ప్రధాని మోడీ కూడా ఆయన స్ఫూర్తితోనే పనిచేస్తున్నారన్నారు.  కానీ కొందరు  ఈరోజు కులం పేరుతో, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని  వీటిని ప్రజలు గమనించాలని సూచించారు. గతంలో పేదలకు రూ. 100  ఇస్తే అందులో రూ. 85 దళారులకు వెళ్ళేవని, కానీ మోడీ ప్రధాని అయ్యాక నేరుగా లబ్దిదారాలు ఖాతాలో పడుతున్నాయని లక్ష్మణ్  తెలిపారు.