‘పొద్దుతిరుగుడు’ను మద్దతు ధరకే కొనాలి  : ఎంపీ రఘునందన్ రావు

‘పొద్దుతిరుగుడు’ను మద్దతు ధరకే కొనాలి  : ఎంపీ రఘునందన్ రావు
  • కేంద్ర మంత్రిశివరాజ్ సింగ్ చౌహాన్‌‌‌‌కు 
  • ఎంపీ రఘునందన్ రావు వినతి 

హైదరాబాద్, వెలుగు: యాసంగిలో రైతులు పండించిన పొద్దుతిరుగుడు పంటను పూర్తిస్థాయిలో మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కోరారు. మార్కెట్‌‌‌‌లో ధరలు పడిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌‌‌‌ను కలిసి పొద్దుతిరుగుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.