CSK హెడ్ కోచ్‌గా ధోనీ?.. అశ్విన్ ట్వీట్ వెనుక అసలు గుట్టు ఇదేనా!

CSK హెడ్ కోచ్‌గా ధోనీ?.. అశ్విన్ ట్వీట్ వెనుక అసలు గుట్టు ఇదేనా!

MS Dhoni: ఐపీఎల్ 2026 (IPL 2026) లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) లీగ్ దశలోనే నిష్క్రమించడంతో ఆ జట్టు భవిష్యత్తుపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని సీఎస్‌కే, ఈ సీజన్‌లో ఆడిన 14 లీగ్ మ్యాచ్‌ల్లో కేవలం 6 మాత్రమే గెలిచి.. చివరి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ దారుణ ప్రదర్శనతో జట్టు లాంగ్-టైమ్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming)పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో సీఎస్‌కే తదుపరి హెడ్ కోచ్‌గా ఎమ్ఎస్ ధోనీ (MS Dhoni) బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందంటూ టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

అశ్విన్ ట్వీట్ వైరల్:
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' (ట్విట్టర్) లో ఒక అభిమాని సరదాగా.. "అశ్విన్ భయ్యా.. నువ్వు సీఎస్‌కే హెడ్ కోచ్ అవ్వకు, ఎందుకంటే మ్యాచ్‌కు ముందే ప్లేయింగ్ ఎలెవన్, స్ట్రాటజీలను నీ యూట్యూబ్ ఛానెల్‌లో లీక్ చేసేస్తావు అంటూ పోస్ట్ చేశాడు. దీనికి అశ్విన్ తనదైన శైలిలో ఫన్నీగా సమాధానమిస్తూ.. నేను కేవలం లీక్ చేయడమే కాదు.. ప్రత్యర్థి జట్టుకు మా బ్యాటింగ్, బౌలింగ్ ప్లాన్స్ కూడా ముందే చెప్పేస్తా.. అంటూనే అసలు ట్విస్ట్ ఇచ్చాడు. అయినా అక్కడ సాక్షాత్తూ MSD (ధోనీ) ఉన్నప్పుడు.. మీరెందుకు వేరే వాళ్ల కోసం వెతుకుతున్నారు? అని ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు. దీంతో ధోనీ నెక్స్ట్ చెన్నై జట్టుకి కోచ్ అవ్వడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.

►ALSO READ | సాల్ట్ కోసం వెంకటేష్ అయ్యర్‎ను తీసేయొద్దు: ఆర్సీబీకి సెహ్వాగ్ కీలక సూచన

కోచ్ ఫ్లెమింగ్ ఏమన్నారంటే?: 
సీఎస్‌కే చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలపై స్పందించాడు. కోచ్‌ల భవిష్యత్తును ఎప్పుడైనా సరే ఫలితాల బట్టే జడ్జ్ చేస్తారు.. నా రోల్‌పై ఎలాంటి నిర్ణయమైనా సరే ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ తీసుకుంటుందని చెప్పుకొచ్చాడు. ధోనీ-ఫ్లెమింగ్ జోడి ఎన్నో టైటిళ్లు అందించినప్పటికీ.. ఈ సీజన్ ఫెయిల్యూర్ జట్టులో సమూల మార్పులు చేసేలా కనిపిస్తుంది.  

కోచ్‌గా ధోనీ ఎందుకు బెస్ట్ ఆప్షన్?: 
గాయాల కారణంగా ధోనీ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.. అయినప్పటికీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటూ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాడు. ధోనీ క్రికెట్ బ్రెయిన్, ఒత్తిడిలోనూ కూల్‌గా ఉండే తత్వం (Captain Cool), యంగ్ ప్లేయర్లను గైడ్ చేసే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీఎస్‌కే ఫిలాసఫీ, టీమ్ కల్చర్ ధోనీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.. ఫ్లెమింగ్ స్థానంలో ధోనీ కోచ్‌గా వస్తే.. జట్టు ఐడెంటిటీ మారకుండా సజావుగా ట్రాన్సిషన్ కొనసాగుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.