చీఫ్​ సెలెక్టర్​గా శివరామ కృష్ణన్​!

చీఫ్​ సెలెక్టర్​గా శివరామ కృష్ణన్​!

సెలెక్టర్ల పదవీకాలం తగ్గించే యోచనలో బీసీసీఐ

ముంబై: నేషనల్‌‌ సెలెక్టర్ల పదవీకాలాన్ని ఐదు నుంచి నాలుగేళ్లకు తగ్గించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. అలాగే కొత్త చీఫ్​ సెలెక్టర్​గా ఎమ్మెస్కే ప్రసాద్​ స్థానంలో లెగ్‌‌ స్పిన్నర్‌‌ లక్ష్మణ్‌‌ శివరామకృష్ణన్‌‌ నియమితులవుతారని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఎమ్మెస్కే పదవీకాలం ఇప్పటికే పూర్తవగా.. ఎక్స్​టెన్షన్​ ఇచ్చే చాన్స్​ లేదని బీసీసీఐఏజీఎం సందర్భంగా  ప్రెసిడెంట్​ గంగూలీ స్పష్టం చేశాడు. నిజానికి సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆఫ్‌‌ అడ్మినిస్ట్రేటర్స్‌‌(సీఓఏ) సెలెక్షన్‌‌ కమిటీ సభ్యుల పదవీ కాలాన్ని నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచింది. అయితే బీసీసీఐ కొత్త పాలక వర్గం  దానిని తిరిగి నాలుగేళ్లకు మార్చాలని అనుకుంటోంది. దీనికి తోడు సెల్టెక్లర్ల పదవీ కాలాన్ని మూడేళ్లు చేస్తే మంచిదని గంగూలీ అన్నాడు. వరల్డ్‌‌కప్‌‌ సైకిల్‌‌ ఆధారంగా నాలుగేళ్ల పదవీ కాలం  డిసైడ్‌‌ చేశారని కానీ మూడేళ్లు చాలని దాదా వాదన. ఏదిఏమైనా 2015లో సెలెక్షన్‌‌ కమిటీలో చేరిన ఎమ్మెస్కే ప్రసాద్‌‌, గగన్‌‌ ఇద్దరూ తమ టర్మ్​ పూర్తి చేసుకోవడంతో వైదొలగక తప్పదు. 2016లో సెలెక్షన్‌‌ కమిటీలో చేరిన జతిన్‌‌ పరాన్‌‌జపే, శరణ్​దీప్‌‌ సింగ్‌‌, దేవాంగ్‌‌ గాంధీ మరో ఏడాది తమ పదవుల్లో కొనసాగుతారు.

MSK Prasad to be replaced by Laxman Sivaramakrishnan as BCCI chief selector