కొత్తపేటలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ ఔట్ లెట్ ఓపెన్

కొత్తపేటలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ ఔట్ లెట్ ఓపెన్

హైదరాబాద్, వెలుగు :  ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ ముకుంద తన మొట్టమొదటి జ్యువలరీ ఫ్యాక్టరీ ఔట్ లెట్​ను బుధవారం ఎల్ బీనగర్ పరిధి కొత్తపేటలో ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా నిర్వాహకులు పలు ఆఫర్లు ప్రకటించారు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం, మేకింగ్ చార్జీలు వేయకుండా కస్టమర్లకు అందజేశారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేపీహెచ్ బీ తో పాటు  ఖమ్మంలో తమ బ్రాంచ్ లను ప్రారంభించామని, దీంతో కస్టమర్ల నుంచి ఊహించని స్పందన వచ్చిందని పేర్కొన్నారు.

బిజినెస్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండగా.. కొత్త పేటలో మరో బ్రాంచ్ ను ఓపెన్ చేసినట్టు సంస్థ ఎండీ నరసింహారెడ్డి తెలిపారు. తమను ఆదరించి ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు చెప్పారు. భవిష్యత్ లో మరిన్ని బ్రాంచ్ లు ప్రారంభిస్తామని ఆయన  వెల్లడించారు.