చెప్పుకోసం ప్రాణాల్ని పణంగా పెట్టి .. పోలీసుల చేతిలో దెబ్బలు తిని

చెప్పుకోసం ప్రాణాల్ని పణంగా పెట్టి .. పోలీసుల చేతిలో దెబ్బలు తిని
చెప్పుకోసం ఓ వృద్దుడు ప్రాణాల్ని పణంగా పెట్టాడు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ముంబై దాహిసర్ రైల్వే స్టేషన్ నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు 60ఏళ్ల వృద్దుడు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అయితే తాను వెళ్లాల్సిన ఫ్లాంట్ ఫామ్ మారిందని తెలుసుకున్న ప్రయాణికుడు రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఓ రైల్వే ట్రాక్ దాటుతుండగా చెప్పు ఊడి ట్రాక్ మీద పడింది. దాన్ని తీసుకునేందుకు ముందుకు వెళ్లి..మళ్లీ వెనక్కి వెళ్లాడు. అదే చెప్పును కాళ్లకి తొడుక్కుని రెప్పపాటులో ట్రైన్ దగ్గరికి వస్తుందనగా ఫ్లాట్ ఫామ్ దాటేందుకు యత్నించాడు. వృద్దుడి  వాలకంపై అనుమానం వచ్చిన రైల్వే పోలీస్ ఒక్క ఉదుటున బాధితుణ్ని ట్రాక్ పై నుంచి ఫ్లాట్ ఫామ్ పైకి లాగాడు. ప్రయాణికుడు చేసిన పనికి ఆగ్రహంతో ఊగిపోయిన రైల్వే కానిస్టేబుల్ చేయిచేసుకున్నాడు. మరోవైపు రైల్వే కానిస్టేబుల్ సాహసంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సీసీటీపుటేజీలో రికార్డ్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెప్పుకోసం ఓ వృద్దుడు ప్రాణాల్ని పణంగా పెట్టాడు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ముంబై దాహిసర్ రైల్వే స్టేషన్ నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు 60ఏళ్ల వృద్దుడు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అయితే తాను వెళ్లాల్సిన ఫ్లాంట్ ఫామ్ మారిందని తెలుసుకున్న ప్రయాణికుడు రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఓ రైల్వే ట్రాక్ దాటుతుండగా చెప్పు ఊడి ట్రాక్ మీద పడింది. దాన్ని తీసుకునేందుకు ముందుకు వెళ్లి..మళ్లీ వెనక్కి వెళ్లాడు. అదే చెప్పును కాళ్లకి తొడుక్కుని రెప్పపాటులో ట్రైన్ దగ్గరికి వస్తుందనగా ఫ్లాట్ ఫామ్ దాటేందుకు యత్నించాడు. వృద్దుడి  వాలకంపై అనుమానం వచ్చిన రైల్వే పోలీస్ ఒక్క ఉదుటున బాధితుణ్ని ట్రాక్ పై నుంచి ఫ్లాట్ ఫామ్ పైకి లాగాడు. ప్రయాణికుడు చేసిన పనికి ఆగ్రహంతో ఊగిపోయిన రైల్వే కానిస్టేబుల్ చేయిచేసుకున్నాడు. మరోవైపు రైల్వే కానిస్టేబుల్ సాహసంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సీసీటీపుటేజీలో రికార్డ్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #WATCH | Maharashtra: A constable of Mumbai Police helped a 60-year-old man, who got stuck at a railway track, save his life at Dahisar railway station in Mumbai yesterday. pic.twitter.com/lqzJYf09Cj — ANI (@ANI) January 2, 2021