ఆర్యన్‌ ఖాన్‌కు మరోసారి నిరాశ..

ఆర్యన్‌ ఖాన్‌కు మరోసారి నిరాశ..

డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ కు ముంబై స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఈ కేసులో  ఆర్యన్ తో పాటు అరెస్టయిన అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాల బెయిల్ పిటిషన్ లను తిరస్కరించింది.

అక్టోబర్ 8 నుంచి ఆర్యన్ ఖాన్ అర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు. ఓ బాలీవుడ్ నటితో ఆర్యన్ డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు NCB దర్యాప్తులో తేలింది. అక్టోబర్ 2న క్రూయిజ్ నౌకలో పార్టీ జరుగుతున్న సమయంలో ఆర్యన్ ఖాన్ ఓ నటితో డ్రగ్స్ గురించి చాటింగ్ చేశారని NCB తెలిపింది. దానికి సంబంధించిన ఆధారాలను సేకరించింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ ను NCB కోర్టుకు సమర్పించింది. బెయిల్ పై తీర్పు వచ్చే సమయంలో NCB కోర్టుకు నివేదిక ఇవ్వడంపై ఆర్యన్ ఖాన్ మరింత ఇరకాటంలో పడ్డాడు. ఇప్పటికే రెండు సార్లు బెయిల్ ను రద్దు చేసిన కోర్టు.