హైదరాబాద్​లో మైగో కన్సల్టింగ్ సెంటర్​

హైదరాబాద్​లో మైగో కన్సల్టింగ్ సెంటర్​

హైదరాబాద్, వెలుగు: షికాగోకు చెందిన ఐటీ కంపెనీ​ మైగో కన్సల్టింగ్​ హైదరాబాద్​లో తన ఆఫీసును స్టార్ట్​ చేసింది.  తెలంగాణ ప్రభుత్వ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ సెంటర్​ను ప్రారంభించారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్  ఇతర పెద్ద ఐటీ కంపెనీలు  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంత ముఖ్యమో,  మైగో కన్సల్టింగ్ వంటి చిన్న  మధ్య తరహా ఐటీ కంపెనీలు అంతే ముఖ్యమైనవని స్పష్టం చేశారు.  తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఇలాంటి కంపెనీలు వెన్నెముక అని అన్నారు. మైగోకు ఎన్నో సెగ్మెంట్లలో, ఎన్నో దేశాల్లో క్లయింట్లు ఉన్నారని అన్నారు. మైగో సీఈఓ శేషు మారంరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్​లో తగినంత ట్యాలెంట్​ ఉంది కాబట్టి ఈ సిటీని ఎంచుకున్నామని చెప్పారు. ఈ కొత్త ఆఫీసును 9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.30 కోట్ల ఇన్వెస్ట్​మెంట్​తో ఏర్పాటు చేశారు. వంద మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. 2025 నాటికి వీరి సంఖ్య ను వెయ్యికి పెంచుతామని రెడ్డి చెప్పారు.