14వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌పై నడాల్ గురి

14వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌పై నడాల్ గురి

జ్వెరెవ్‌తో సెమీస్​ ఫైట్​
సా.6.15 నుంచి సోనీలో


పారిస్‌ :
సుదీర్ఘ కాలం పాదం గాయంతో ఇబ్బందిపడ్డ స్పెయిన్‌ స్టార్‌ రఫెల్ నడాల్‌ మళ్లీ మునుపటి ఫామ్‌లోకి వచ్చేశాడు. సీజన్‌ తొలి గ్రాండ్‌ స్లామ్‌ ఆస్ట్రేలియన్​ ఓపెన్‌ను గెలిచి అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ (21) రికార్డు సృష్టించిన నడాల్‌.. ఇప్పుడు 14వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌పై కన్నేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే సెమీస్‌లో జ్వెరెవ్‌ (జర్మనీ)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. శుక్రవారమే 36వ పడిలోకి అడుగుపెడుతున్న రఫా విజయంతో గ్రాండ్‌గా బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసుకోవాలని భావిస్తున్నాడు.

గ్రాండ్‌ స్లామ్స్‌ రికార్డుల్లో  ఫెడరర్‌ (20), జొకోవిచ్‌ (20)ను అధిగమించిన నడాల్‌.. 22వ టైటిల్‌తో మరింత ఎత్తులో నిలవాలని ప్లాన్స్‌ వేస్తున్నాడు. జ్వెరెవ్‌తో ముఖాముఖి రికార్డులో 6–3తో ముందున్న నడాల్‌ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా దిగుతున్నాడు. ఇద్దరి మధ్య క్లే కోర్టులో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు నడాల్‌ విజయం సాధించాడు. రఫా కంటే 11 ఏళ్లు చిన్నవాడైన జ్వెరెవ్‌.. తొలి గ్రాండ్‌స్లామ్‌ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు.

మరిన్ని వార్తల కోసం : -
ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ లోకి నడాల్‌ కమాల్


ఇంటివాడైన దీపక్ చాహర్