ఇంటివాడైన దీపక్ చాహర్ 

ఇంటివాడైన దీపక్ చాహర్ 

టీమ్ ఇండియా బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చాహర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి జయ భరద్వాజ్ మెడలో తాళి కట్టాడు. బుధవారం ఆగ్రాలో ఈ వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోను దీపక్ సోదరుడు, స్పిన్నర్ రాహుల్ చాహర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పలువురు క్రికెటర్లు దీపక్ కు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ఈ వివాహం జరిగింది. బుధవారం ఉదయం దీపక్, జయ భరద్వా‌‌‌‌జ్ లకు హల్ దీ కార్యక్రమం నిర్వహించారు. దీపక్ తెలుగు రంగు కుర్తా ధరించి కనిపించాడు. స్నేహితులు, రాహుల్ తో కలిసి అతనికి పసుపు రాశారు. వివాహానికంటే ముందు.. సంగీత్ పంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ లో చాహర్ డ్యాన్స్ తో అలరించాడు.


ఇటీవలే దుబాయ్‌‌లో జరిగిన భారత టీ 20 లీట్ 14వ సీజన్‌‌లో పంజాబ్‌‌తో మ్యాచ్ జరిగింది. 2021, అక్టోబర్ 07వ తేదీన జరిగిన ఈ మ్యాచ్‌‌కు ప్రేయసి జయ భరద్వాజ్ కూడా హాజరయ్యారు. మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానం గ్యాలరీకి వచ్చిన దీపక్ అందరి ముందు.. తన ప్రేమను తెలియచేశాడు. దీనికి సంబంధించిన వీడియో అప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రాహుల్ చాహర్ కూడా ఇటీవలే..ప్రేయసి ఇషాన్ జోహార్ ను వివాహమాడాడు. దీపక్ చాహర్ ను మెగా వేలంలో రూ. 14 కోట్ల భారీ ధరకు చెన్నై కొనుగోలు చేసింది. కానీ.. గాయాల కారణంగా.. ఈ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. 29 సంవత్సరాల దీపక్ చాహర్ 63 మ్యాచ్ ల్లో 59 వికెట్లు తీసి.. 29.19 యావరేజ్ సాధించాడు. 2019లో 17 మ్యాచ్ లు ఆడి.. 22 వికెట్లు తీశాడు. టీమిండియా తరపున ఇతను ఏడు వన్డేలు, 20 టీ20 లు ఆడి.. 10 వికెట్లు తీశాడు. 

మరిన్ని వార్తల కోసం :-
హాకీ ఆసియాకప్ లో భారత్ కు కాంస్యపతకం


ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ లోకి నడాల్‌ కమాల్