హాకీ ఆసియాకప్ లో భారత్ కు కాంస్యపతకం

హాకీ ఆసియాకప్ లో భారత్ కు కాంస్యపతకం

హాకీ ఆసియా కప్ లో భారత్ కాంస్య పతకం సాధించింది. కాంస్యపతక పోరులో జపాన్ లో జరిగిన మ్యాచ్ లో 1-0తో గెలిచింది. మంగళవారం సౌత్ కొరియాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ డ్రా అవడంతో భారత్ ఫైనల్ చేరలేదు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ తరుపున ఏకైక గోల్ ను రాజ్ కుమార్ పాల్ 7వ నిమిషంలో కొట్టాడు. ఆ తర్వాత ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. జపాన్ కు పెనాల్టీ లభించిన మన జట్టు డిఫెన్స్ బలంగా ఉండడంతో జపాన్ విఫలమైంది. దీంతో భారత్ కాంస్యపతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక హాకీ ఆసియాకప్ విజేతగా సౌత్ కొరియా నిలిచింది. మలేషియాతో జరిగిన ఫైనల్స్ లో 2-1 గోల్స్ తేడాతో స్వర్ణ పతకాన్ని సాధించింది.

మరిన్ని వార్తల కోసం

ప్రధానిని కలిసిన నిఖత్ జరీన్

 

ఇక దాదా నయా జర్నీ