విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్ వైద్యం.. నెట్వర్క్ హాస్పిటళ్ల సంఖ్య 253కు పెంపు

విద్యుత్ ఉద్యోగులు,  పెన్షనర్లకు కార్పొరేట్ వైద్యం..  నెట్వర్క్ హాస్పిటళ్ల సంఖ్య 253కు పెంపు

హైదరాబాద్, వెలుగు: విద్యుత్​ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్​వైద్యం అందాలన్న లక్ష్యంతో తెలంగాణ దక్షిణ విద్యుత్​పంపిణీ సంస్థ(టీజీఎస్​పీడీసీఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. నెట్​వర్క్​హాస్పిటళ్ల(ప్రైవేట్, కార్పొరేట్) సంఖ్యను 253కు పెంచుతూ సంస్థ సీఎండీ జితేశ్​వి.పాటిల్​గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

గతంలో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న 71 హాస్పిటళ్లలో మాత్రమే వైద్య సేవలు పొందే అవకాశం ఉండేది. ఈ క్రమంలో సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయ్స్, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని హాస్పిటళ్ల సంఖ్యను పెంచారు. ఈ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.