ఇక దాదా నయా జర్నీ

ఇక దాదా నయా జర్నీ

సౌరవ్ గంగూలీ క్రికెట్ లోకి అడుగుపెట్టి 30 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో దాదా ట్విట్టర్ వేదికగా అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. ‘1992లో క్రికెట్ లోకి అడుగుపెట్టా. 30 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. అందులో చాలా ముఖ్యమైనది మీ(అభిమానుల) అండదండలు. మీ అభిమానమే నన్ను ఇంతటి వాణ్ని చేసింది. ఈ రోజు నుంచి కొత్త జర్నీ మొదలుపెట్టబోతున్నా. నా ఈ కొత్త ప్రయాణంలో ప్రజలకు మరింత సేవ చేయాలనుకుంటున్నా. ఎప్పటిలాగే దీనికి కూడా మీ సపోర్టు ఉంటుందని ఆశిస్తున్నా’ అంటూ సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశాడు. 

దాదా తాజా ప్రకటనతో అటు క్రికెట్ అభిమానులు, ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ దాదా మొదలుపెట్టబోయే ఆ కొత్త జర్నీ ఏంటనీ అందరూ చర్చించుకుంటున్నారు. కాగా..సౌరవ్ గంగూలీ ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఇకపోతే త్వరలోనే దాదా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం...

నిఖత్ జరీన్, ఈషా సింగ్కు సర్కార్ భారీ ..

ఇండియా విమెన్స్‌‌‌‌ టీటీ టీమ్‌‌‌‌లో శ్రీ..