తెలంగాణ రాష్ట్రంలో 47 వేల కోట్లతో రైల్వే పనులు,,346 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో 47 వేల కోట్లతో రైల్వే పనులు,,346 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
  • కవచ్ 3.2లో 63 స్టేషన్లను కవర్ ​చేస్తున్నమని వెల్లడి

హైదరాబాద్​సిటీ, వెలుగు: రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చెప్పారు. 346 కిలోమీటర్లమేర  కొత్త రైల్వే లైన్లు, 513 కిలోమీటర్ల డబుల్ లైన్, మూడో లైన్, నాల్గో లైన్, బైపాస్ లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు.

గురువారం హైదరాబాద్​లోని నాంపల్లి స్టేషన్​లో జరుగుతున్న అభివృద్ధి, ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. కవచ్ 3.2లో తెలంగాణలోని 63 స్టేషన్లను కవర్ చేస్తూ 639 కి.మీ.లకు పైగా రూట్ కిలో మీటర్లకు ఏర్పాటు చేశామన్నారు. ఈ సెక్షన్లలో కవచ్ 4.0 కి అప్‌‌‌‌గ్రేడ్ పనులు జరుగుతున్నాయని, అదనంగా 384 రూట్ కిలోమీటర్లలో కొత్తగా ఈ పనులు సాగుతున్నాయని చెప్పారు. 

నాంపల్లి స్టేషన్​కు రూ.327 కోట్లు  

నాంపల్లి రైల్వేస్టేషన్​ను​ రూ.327.27 కోట్ల వ్యయంతో డెవలప్​ చేస్తున్నామని, ఆధునీకరణ పనులు స్పీడ్​గా జరుగుతున్నాయని కిషన్​రెడ్డి చెప్పారు. ఇక్కడి నుంచి రోజుకు 60  రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయని, సగటున 28 వేల మంది ప్రయాణికులు జర్నీ చేస్తున్నారన్నారు. భవిష్యత్​ అవసరాల దృష్ట్యా మరింత ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు.

ఇక్కడ 16 లిఫ్టులు..8 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు , బేస్‌‌‌‌మెంట్ పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, సీసీ టీవీ, వై-ఫై, ఫుడ్ కోర్టు, ఫార్మసీ,  వైద్య సౌకర్యాలు, దివ్యాంగుల కోసం సౌలత్​లు కల్పిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డీఆర్​ఎం డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సందీప్ జైన్, సీపీఆర్​ఓ ఎ. శ్రీధర్ ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు