అమ్మాయిలకు పింక్ టెస్ట్..ఇవాళ్టి(మార్చి6)నుంచి..ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ మ్యాచ్

అమ్మాయిలకు పింక్ టెస్ట్..ఇవాళ్టి(మార్చి6)నుంచి..ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ మ్యాచ్

పెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎదురైన పరాజయాన్ని పక్కన పెట్టి హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఇండియా విమెన్స్ టీమ్.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అయింది.  శుక్రవారం నుంచి పెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే ఏకైక డే -నైట్ (పింక్ బాల్) టెస్టులో ఆసీస్‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది. గత ఐదు టెస్టుల్లో ఓటమి ఎరుగని ఇండియా 2023లో ముంబై వేదికగా ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించిన స్ఫూర్తితో బరిలోకి దిగుతోంది.

 ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పటిష్టమైన రికార్డు ఉన్న స్మృతి మంధాన, షెఫాలీ వర్మ దీప్తి శర్మ వంటి సీనియర్లు రాణిస్తే, ఆస్ట్రేలియా గడ్డపై ఇండియా తొలిసారి టెస్ట్ విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. సీనియర్ పేసర్ రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెస్ట్ ఇవ్వడంతో యంగ్ సెన్సేషన్ కశ్వీ గౌతమ్ టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు తమ కెప్టెన్ అలీసా హీలీకి ఇది చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడంతో ఆమెకు విజయాన్ని బహుమతిగా ఇవ్వాలని చూస్తోంది.