ప్రధానిని కలిసిన నిఖత్ జరీన్

ప్రధానిని కలిసిన నిఖత్ జరీన్

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ ప్రధాని మోడీని కలిశారు. గత నెలలో టర్కీలో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. ఈ నేపథ్యంలో నిఖత్ తో పాటు బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన మనీషా మౌన్, పర్విన్ హుడా కూడా ప్రధానిని కలిశారు. మెడల్స్ సాధించిన తీరును ప్రధానితో పంచుకున్నారు. ఇక ప్రధానిని కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు నిఖత్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

కాగా టర్కీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో నిఖత్ జరీన్ స్వర్ణాన్ని అందుకుని తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పటికే జూనియర్ ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్..సీనియర్ స్థాయిలోనూ తొలిసారి టైటిల్ ను ముద్దాడి కొత్త చరిత్ర లిఖించింది. ఇక మహిళల బాక్సింగ్ లో భారత్ కు ఇప్పటివరకు ఆరుసార్లు స్వర్ణ పతాకాలు దక్కాయి.మేరికోమ్, సరితాదేవి, ఆర్.ఎల్ జెన్ని, లేఖ ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. ఇప్పుడు ఆ జాబితాలో నిఖత్ జరీన్ కూడా చేరింది.