కార్గిల్‌లో అమీర్ ఖాన్, నాగచైతన్య

కార్గిల్‌లో అమీర్ ఖాన్, నాగచైతన్య

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమిర్‌ఖాన్‌ నటిస్తున్న హిందీ సినిమా 'లాల్‌సింగ్‌ చద్దా'తో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్య బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా అకౌంట్‌ ద్వారా శుక్రవారం అధికారికంగా ప్రకటిస్తూ లోకేషన్‌ ఫోటోను షేర్‌ చేశారు నాగచైతన్య. ఈ ఫోటోలో అమిర్‌ ఖాన్‌, కిరణ్‌రావు, ఈ చిత్ర దర్శకుడు అద్వైత్‌ చందన్‌ కలసి ఉన్నారు. ఇందులో ఆర్మీ దుస్తుల్లో కనిపించారు చైతూ, ఆమీర్‌. ప్రస్తుతం ఈ సినిమా తుది షెడ్యూల్‌ని కార్గిల్‌లో చిత్రీకరిస్తున్నారు. 20రోజుల పాటు ఈ షూటింగ్‌ కొనసాగుతుందని చిత్రవర్గాలు తెలిపాయి.

అమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్‌ అవార్డు విన్నింగ్‌ ఫిల్మ్‌, హాలీవుడ్‌ కల్ట్‌ క్లాసిక్‌ 'ఫారెస్ట్‌గంప్‌' చిత్రానికి హిందీ రీమేక్‌గా 'లాల్‌సింగ్‌ చద్దా' తెరకెక్కుతుంది. ఈ మూవీలో కరీనా కపూర్  హీరోయిన్ గా నటిస్తోంది.