టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్లో క్లారిటీ లేదు

టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్లో క్లారిటీ లేదు

ఎకానమి క్లాస్ ఫ్లైట్ ఛార్జీలపై అప్పర్ లిమిట్ ఫిక్స్ చేయాలని రవాణా, పర్యాటక, సాంస్కృతిక విభాగాల పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ నివేదికను చైర్మన్ TG వెంకటేశ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు తగ్గినప్పటికీ... ఎయిర్ లైన్స్ కంపెనీలు ధరలు తగ్గించడంలేదని కమిటీ అభిప్రాయపడింది. ఛార్జీలను తగ్గించడం ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు తగ్గడం ద్వారా ఏర్పడిన ప్రయోజనాలను ప్యాసింజర్స్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.  

ఇక టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్లోనూ సరైన విధానం లేదని కమిటీ తెలిపింది. టికెట్స్ క్యాన్సిలేషన్ ఫేర్ ను రేషనలైజ్ చేయాలని... ప్యాసింజర్స్ నుంచి ఎంత ఛార్జ్ చేయాలో నిర్ణయించాలని కేంద్రానికి సూచించింది కమిటీ. టికెట్  బేస్  ఫేర్ లో మ్యాగ్జిమం సగం వరకే క్యాన్సిలేషన్ ఛార్జ్ ఉండాలని... అంతకుమించి ఉండకూడదని గతంలోనే సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ప్రయాణికుల నుంచి వసూలుచేసిన ట్యాక్స్ లు, సర్ చార్జీలను కూడా రీఫండ్ చేయాలని కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిర్ లైన్స్ సంస్థలతో  కేంద్ర ప్రభ్వుత్వం చర్చించాలని కమిటీ సూచించింది.  

విమానాల రద్దు, లేట్ కారణంగా ఎయిర్  పోర్ట్స్ లోనే ఉండిపోయిన ప్యాసింజర్స్ కోసం అన్ని ఏయిర్ పోర్ట్స్ లో స్థలం కేటాయించాలి. వారికి ఫుడ్, వాటర్, మెడికల్ ఫెసిలిటీస్, ఇతర సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కమిటీ సూచించింది. అలాగే కరోనా కారణంగా దెబ్బతిన్న సివిల్ ఏవియేషన్ సెక్టార్ ను ఆదుకునేందుకు వెంటనే లాంగ్ టైమ్ మెజర్స్ చేపట్టాలని సిఫార్సు చేసింది. ఈ రంగానికి సంబంధించిన అన్ని వ్యాపారాలనూ ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించి లోన్స్ ఇవ్వాలని తెలిపింది. పౌర విమానయానశాఖ స్పెషల్ ఫండ్ ఏర్పాటు చేసి, ఏవియేషన్ ఇండస్ట్రీకి లోన్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది.  దేశంలో పైలెట్ల కొరతను దృష్టిలో పెట్టుకుని పైలెట్  ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ సెటప్ చేయాలని పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.