మెన్స్ జావెలిన్ త్రోలో రజతం దక్కించుకున్న నీరజ్ చోప్రా

మెన్స్ జావెలిన్ త్రోలో రజతం దక్కించుకున్న నీరజ్ చోప్రా

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు. జావెలిన్ త్రోలో భారత్ కు సిల్వర్ మెడల్ ను అందించారు. మొదటి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా.. తన కెరీర్ లో మూడో అత్యుత్తమ త్రోగా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు మూడు ప్రపంచ ఛాంపియన్ షిపుల్లో పాల్గొన్న చోప్రా... రెండు సార్లు మెడల్స్ సాధించాడు. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో పథకం సాధించిన రెండో భారతీయుడిగా నీరజ్ రికార్డు సాధించారు. 2003లో అంజు బాబీ జార్జ్ పతకం సాధిస్తే..... 19 ఏళ్లు తర్వాత ఇప్పుడు నీరజ్ చోప్రా దేశానికి సిల్వర్ అందించాడు. 

ఇటీవల డైమండ్  లీగ్ లో 89.94 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన నీరజ్ .. 6 సెంటీ మీటర్ల తేడాతో 90 మీటర్ల మార్క్ ను కోల్పోయాడు. డిఫెండింగ్  ఛాంపియన్  అండర్సన్  పీటర్స్, ఒలింపిక్  రజత పతక విజేత వాద్లిచ్, వెబర్ నుంచి నీరజ్ కు గట్టి పోటీ ఎదురయ్యింది. డైమండ్  లీగ్ లో 93.07 మీటర్ల దూరం విసిరిన అండర్సన్  గోల్డ్ మెడల్ సాధించాడు. దేశానికి పతకం సాధించి పెట్టడంతో నీరజ్ స్వగ్రామం సంబరాలు చేసుకుంది. నీరజ్ తల్లిదండ్రులు గ్రామంలో బాణాసంచా పేల్చి వేడుకలు చేసుకున్నారు. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నీరజ్ చోప్రాను ప్రశంసించారు. నీరజ్ చోప్రా మరోసారి రికార్డు సృష్టించాడని, వరల్డ్ ఛాంపియన్ షిప్ లో మెడల్ గెలుచుకున్న రెండో భారతీయ ఆటగాడిగా పేరు తెచ్చిపెట్టినందుకు నీరజ్ ను కొనియాడారు.