సర్జరీ చేయకుండా డాక్టర్లు వెళ్లిపోయారని మహిళ ఆందోళన

సర్జరీ చేయకుండా డాక్టర్లు వెళ్లిపోయారని మహిళ ఆందోళన
  • సర్జరీ చేయకుండా డాక్టర్లువెళ్లిపోయారని మహిళ ఆందోళన
  • భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

యాదాద్రి భువనగిరి జిల్లా: సర్జరీ చేస్తామని చెప్పి సరైన సమయానికి వైద్యులు వెళ్లిపోయారని మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో శనివారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ క్యాంపు నిర్వహించారు. రెండు మండలాలు అని చెప్పి, తీరా ఒకే మండలానికి చెందిన మహిళకు కుటుంబ నియంత్రణ చేస్తామని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆపరేషన్ ఉంటుందని ఉదయం నుంచి  ఏం తినకుండా వచ్చిన మహిళ డాక్టర్లపై గొడవకు దిగింది. ముందే చెబితే వెళ్లేవాళ్లం కదా.. ఇంజక్షన్ ఇచ్చి, వెయిట్ చేపించి తీరా సాయంత్రానికి సర్జరీ చేయమంటారా అంటూ సీరియస్ అయ్యారు మహిళ బంధువులు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా డాక్టర్లు ఎవరికి ఆపరేషన్ చేయకుండా వెళ్లిపోయారు.

వివరాలు:  యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి , రాజాపేట మండలాలకు చెందిన 100కి పైగా మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం  శనివారం ఉదయం భువనగిరి ఆస్పత్రికి వచ్చారు. వారిని సంబంధిత మండలాల ఆశా కార్యకర్తలు ఆపరేషన్ కోసం తీసుకొచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆపరేషన్ కోసం 12 మందికి మత్తు ఇంజక్షన్లూ ఇచ్చారు. అయితే చివరకు డాక్టర్లు ఈ రోజు రాజపేట మండలం వాళ్ళకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తామని,  తుర్కపల్లి మండలం వాళ్లకు వచ్చే నెల 5న చేమని ఆశా కార్యకర్తలకు , కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళలకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన ఆశా కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆపరేషన్ కోసం  వచ్చిన మహిళలు, వారి కుటుంబ సభ్యులు వైద్యుల నిర్ణయం సీరియస్ అయ్యారు. ఉదయం నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆహారం, వాటర్ సేవించకుండా  మహిళలు ఆపరేషన్ కోసమే వెయిట్ చేస్తే సాయంత్రం వరకు కూర్చోబెట్టుకొని ఆపరేషన్ చేయమని అంటే ఎలా అని ప్రశ్నించారు. అసలే ఎండాకాలం చిన్నపిల్లలతో వచ్చి తీవ్ర ఇబ్బందులు పడ్డామని బాధితులు తెలిపారు.  

ఆశా కార్యకర్తలు తమని టార్గెట్ పూర్తి చేయాలని ఒత్తిడి చేసి, తీరా మహిళలను వారి కుటుంబ సభ్యులను ఒప్పించి ఇక్కడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం తీసుకువస్తే ఆపరేషన్ చేయమని డాక్టర్లు చెప్పారన్నారు. ఇప్పుడు మేము తీసుకొచ్చిన మహిళల కుటుంబ సభ్యులు మమ్మల్ని నిలదీస్తున్నారని ఆశా కార్యకర్తలు, పిహెచ్ సిఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో  ఆస్పత్రిలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఆపరేషన్ కోసం వచ్చిన మహిళల కుటుంబ సభ్యులు, ఆశా కార్యకర్తలు, ఆస్పత్రి సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. డిఎంహెచ్ ఓ సాంబశివరావుని సంప్రదించగా.. మహిళలకు ఆపరేషన్ ముందు నిర్ధారణ పరీక్షలు, వారికి మత్తు పడుతుందా? లేదా ? అని చెక్ చేస్తారని అన్నారు. అంతే కానీ మత్తు మందు ఇచ్చి వైద్యులు వెళ్లిపోయారని అనటం కరెక్ట్ కాదన్నారు. ఆపరేషన్ చేసే వైద్యుడికి ఆరోగ్యం సహకరించకపోవటంతో వచ్చే నెల 5న మళ్ళీ క్యాంపు నిర్వహిస్తామని సాంబశివరావు చెప్పుకొచ్చారు.  

ఇవి కూడా చదవండి..

ఓయూలో పూర్వ విద్యార్థుల అరుదైన సమ్మేళనం

పన్ను కట్టలేదని రిజిస్ట్రేషన్ ఆఫీసు సీజ్