ఓయూలో పూర్వ విద్యార్థుల అరుదైన సమ్మేళనం

ఓయూలో పూర్వ విద్యార్థుల అరుదైన సమ్మేళనం
  • అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఖజకిస్తాన్ కౌన్సిల్ జనరల్ నవాబ్ నాసర్ అలీఖాన్

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో 1986..89 పీజీ బ్యాచ్ ఆలుమ్నీ మీట్ జరిగింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైన ఆనాటి స్టూడెంట్స్.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇందులో.. ఖజకిస్తాన్ కౌన్సిల్ జనరల్ గా పనిచేస్తున్న నవాబ్ నాసర్ అలీఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ మెజిషియన్ సామల వేణు కూడా ఆలుమ్ని మీట్ కు హాజరయ్యారు. పాత ఫ్రెండ్స్ అందర్నీ ఒకేచోట మళ్లీ కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు సామలవేణు. అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయన్నారు. తాను ఫుట్ బాల్ టీమ్ లో ఆడేవాడినని అన్నారు.  ఇలాంటి అరుదైన కార్యక్రమానికి శ్రమించిన నిర్వాహకులు, ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

 

ఇవి కూడా చదవండి

పన్ను కట్టలేదని రిజిస్ట్రేషన్ ఆఫీసు సీజ్

భారత్ లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన