భారత్ లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన

భారత్ లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన
  • గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా భారత్ - చైనా విదేశాంగ మంత్రులు ఫేస్ టు ఫేస్ మీట్

న్యూఢిల్లీ: భారత్ లో పర్యటిస్తున్నారు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ. విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు చైనా మంత్రి వాంగ్ యీ. ఢిల్లీలోని హైదరాబాద హౌస్ లో భారత్- చైనా మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. పార్లమంట్ సౌత్ బ్లాక్ లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో వాంగ్ యీ భేటీ అయ్యారు. భారత్ – చైనా సరిహద్దు వివాదం, ఉక్రెయిన్ యుద్ధంతో నెలకొన్న భౌతిక రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. 
గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫేస్ టు  ఫేస్ మీట్ అవ్వడం ఇదే తొలిసారి.

రెండేళ్లక్రితం తలెత్తిన ప్రతిష్ఠంభన కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్నుంచి ఇతర దేశాల మధ్య అత్యున్నత స్థాయి పర్యటన ఇదే. వాంగ్ యీ పర్యటనపై చైనా కానీ, భారత్ కానీ ముందుగా ప్రకటించలేదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడం.. ఈ ఏడాది చివర్లో బీజింగ్ లో నిర్వహించబోయే బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు వాంగ్ యీ ఢిల్లీకి వచ్చినట్లు సమాచారం. మరోవైపు పాక్ లో ఈ వారం జరిగిన ఇస్లామిక్ సహకార సంస్థ .. ఓఐసీ సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరైన వాంగ్.. అందులో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో వాంగ్ యీ భారత్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

 

ఇవి కూడా చదవండి

ఆలేరులో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

RRR షో రద్దైందని రచ్చ రచ్చ

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు