కారు ఢీకొని తల్లి మృతి..కుమారుడికి తీవ్ర గాయాలు .. మెదక్ జిల్లాలో ఘటన

కారు ఢీకొని తల్లి మృతి..కుమారుడికి తీవ్ర గాయాలు .. మెదక్ జిల్లాలో ఘటన

శివ్వంపేట, వెలుగు: కారు ఢీకొని తల్లి మృతిచెందగా.. కుమారుడికి తీవ్ర గాయాలైన ఘటన మెదక్​జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలంలోని బిజిలిపూర్ కు చెందిన సాదిక్ బుధవారం రాత్రి తల్లి జుబేదా బేగం(50)తో కలిసి బైక్​పై గోమారం వెళ్తున్నాడు.

గోమారం గ్రామ శివారులో నర్సాపూర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జుబేదా బేగం తీవ్రంగా గాయపడి  స్పాట్ లోనే మృతి చెందింది. సాదిక్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.