అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘లెనిన్’ (LENIN). ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. జులై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అందుకోవాలనే లక్ష్యంతో అఖిల్, భాగ్యశ్రీ ఉన్నారు. అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ మురళీ కే కిషోర్ పక్కా మాస్, యాక్షన్ రూరల్ డ్రామాగా తెరకెక్కించారు. వరుస ప్రమోషన్స్, ఈవెంట్స్ నిర్వహిస్తూ వస్తున్న మేకర్స్.. తాజాగా ‘లెనిన్’ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.
ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలైనట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘వెయిటింగ్ ఓవర్.. ఇక మొదలవుతోంది.. లెనిన్ తుఫాను.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి’’ అని వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన ‘ట్రైలర్, గ్లింప్స్, సాంగ్స్’ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి.
The calm is over...
— Sithara Entertainments (@SitharaEnts) July 7, 2026
Now begins the #LENIN storm. ❤️🔥❤️🔥❤️🔥
Bookings are now OPEN across Andhra Pradesh & Telangana. 💥💥💥#LeninOnJuly10th @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1 @NavinNooli @artkolla @leonbrittodp… pic.twitter.com/1xwzMDqhHE
ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కింది. చిత్తూరు ప్రాంతపు కథాంశంతో ఎమోషనల్ లవ్ స్టోరీ, హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా ఉండేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు డైరెక్టర్ మురళీ కిషోర్. అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు, సితార ఎంటర్టైన్మెంట్స్సంయుక్తంగా నిర్మించాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవ్వనుందని సినీ వర్గాల టాక్. మరి ‘లెనిన్’తో అఖిల్ ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటాడో అనే ఆసక్తి నెలకొంది.
