హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ (బీఐఏసీహెచ్అండ్ఆర్ఐ) సీనియర్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ విభావరి నాయక్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా అనస్థీషియాలజిస్టులకు అత్యున్నత సంస్థ అయిన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఆఫ్ అనస్థీషియాలజిస్ట్స్ (డబ్ల్యూఎస్ఏ)2026 ఏడాదికి గాను ఆమెను క్లినికల్ లీడ్ గా నియమించింది.
‘అనస్థీషియాలజీ అలాంగ్ ది పేషంట్ పాత్ వే’ అనే థీమ్‌తో పనిచేయనున్న ఆమె.. వెనుకబడిన దేశాల్లోని డాక్టర్లకు అత్యాధునిక వైద్య విజ్ఞానాన్ని, కొత్త చికిత్సా పద్ధతులను వీడియోలు, వెబినార్ల ద్వారా చేరవేసే బాధ్యతలను నిర్వర్తించనున్నారు. విభావరి దాదాపుగా 20 ఏండ్లుగా వైద్య సేవలందిస్తున్నారు.
