న్యూఢిల్లీ: ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం చుట్టూ రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ.. బుధవారం ఢిల్లీ పోలీసులు ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌజ్ఇండియా(పీఆర్ హెచ్ఐ)కు నోటీసులు జారీ చేశారు. ఈ పుస్తకం ఇంకా అధికారికంగా ప్రచురణకు రాకముందే దాని పీడీఎఫ్ వెర్షన్ సోషల్ మీడియాలో, వెబ్‌సైట్లలో అనధికారికంగా సర్క్యులేట్అవుతున్నట్టు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు.
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ నోటీసు జారీ చేసింది. పుస్తకం లీక్ అయిన విషయంలో దర్యాప్తుకు సహకరించాలని పెంగ్విన్ సంస్థను కోరింది. ఈ ఘటనపై క్రిమినల్ కాన్స్పిరసీ (కుట్ర) ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈ నోటీసు అందజేశారు. ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఈ పుస్తకం నుంచి కొన్ని భాగాలను ఉటంకిస్తూ చర్చను లేవనెత్తారు.
అందులో గల్వాన్ లోయ ఘర్షణలు, ఇతర సున్నితమైన అంశాలపై జనరల్ నరవణే తన అనుభవాలను పంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే, రాహుల్చర్చను ప్రారంభించగానే పలువురు మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంశారు. ప్రచురితం కాని బుక్‌ను పరిగణనలోకి తీసుకోలేమన్నారు.
