హైదరాబాద్ సిటీ, వెలుగు: ముద్ర లోన్సర్వీసెస్పేరుతో ఓ మహిళ వద్ద నుంచి రూ.లక్ష కాజేసిన వరంగల్ జిల్లాకు చెందిన బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్ ను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో లోన్ యాడ్ చూసిన హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ దాన్ని ఓపెన్ చేసింది.
మరుసటి రోజు నిందితుల్లో ఒకరు ముద్ర లోన్ సర్వీసెస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. రూ.3 లక్షల లోన్ మంజూరైందని నమ్మించాడు. ప్రాసెసింగ్ ఫీజు లేదని చెప్పి ఆధార్, పాన్ వివరాలు అడిగాడు. ఆ తర్వాత ఇన్సూరెన్స్, టీడీఎస్, ఇతర చార్జీల పేరుతో ఆమె వద్ద నుంచి మొత్తం రూ.1,08,274 కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు.
