85 శాతం సీట్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కే..గతంలో బీఆర్ఎస్ బెదిరింపులతో ఏకగ్రీవాలు చేయించింది : మంత్రి వివేక్ వెంకటస్వామి

85 శాతం సీట్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కే..గతంలో బీఆర్ఎస్ బెదిరింపులతో ఏకగ్రీవాలు చేయించింది : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించింది
  • ఎక్కడా బెదిరింపులు, పోలీసు ఒత్తిళ్లు లేవు
  • మంచిర్యాలలో ఓటు వేసిన మంత్రి

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 85 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ​ గెలుచుకుంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయన్నారు. బుధవారం మంచిర్యాలలోని 52వ డివిజన్ హైటెక్ సిటీ కాలనీలో మంత్రి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లోని పోలింగ్ బూత్‌‌‌‌‌‌‌‌లను సందర్శించి ఎన్నికల సరళిని పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, గతంలో పోలీసులను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పార్టీ హరించిందని, ఎన్నికలు నిర్వహించకుండా బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేయించిందని ఆరోపించారు. చెన్నూరులో గుండాగిరి, బెదిరింపులతో పది మంది అభ్యర్థులను బలవంతంగా విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేయించి ఏకగ్రీవాలు చేసుకున్నారన్నారు. ప్రస్తుతం ఎక్కడా పోలీసు ఒత్తిళ్లు, బెదిరింపులు లేవన్నారు.

తమ రెండేండ్ల పాలనలో ప్రతిపక్ష లీడర్లపై కేసులు పెట్టలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభివృద్ది, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అవినీతికి మధ్య మున్సిపల్ ఎన్నికలు జరిగాయన్నారు. చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో అత్యధిక సీట్లు గెలుచుకుంటామని, తాను ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

బొగ్గు గనులు అడ్డుకున్న బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్..

కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ అన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో చెన్నూరుకు సంబంధించిన డీఎంఎఫ్‌‌‌‌‌‌‌‌టీ, సీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ నిధులను హరీశ్ రావు, కేటీఆర్ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌‌‌‌‌‌‌‌కు తరలించి ఇక్కడి ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు.

చెన్నూరులో బాల్క సుమన్ ఇసుక, భూ దందాలతో రూ.వందల కోట్లు దండుకున్నాడని ఆరోపించారు. సింగరేణికి కొత్త బొగ్గు గనులు రాకుండా బీఆర్ఎస్​పార్టీ అడ్డుకుందన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి కేంద్రం నిర్వహిస్తున్న వేలంలో సింగరేణి పాల్గొనేలా చూశానని చెప్పారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో సింగరేణికి తక్కువ లాభాలు వచ్చాయని, తాము వచ్చిన తర్వాత లాభాలు మూడు రెట్లు అయ్యాయని తెలిపారు.

1,200 మెగావాట్ల జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో 800 మెగావాట్ల మూడో యూనిట్ పనులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గని విస్తరణలో భాగంగా రెండో ఫేజ్ కొత్త గనిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో స్థానికులకు 10 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

క్యాతనపల్లి, చెన్నూరు, మందమర్రి మున్సిపాలిటీల్లో ఇంటింటికి నీరందించేందుకు రూ.100 కోట్లతో అమృత్ స్కీం చేపట్టామని, మరో ఈ పనులు పూర్తవుతాయన్నారు. చెన్నూరులో 100 పడకల ఆసుప్రతిని మేలో ప్రారంభిస్తామని, 25 మంది డాక్టర్ల పోస్టులు కూడా మంజూరయ్యాయని వెల్లడించారు. మంత్రి వెంట డీసీసీ రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, కాంగ్రెస్ నేత చెరుకు సరోత్తంరెడ్డి, చెన్నూరు వ్యవసాయ కమిటీ చైర్మన్ మహేశ్ తివారీ పాల్గొన్నారు.