మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నాలుగు రోజుల్లో మూడుసార్లు పెట్రో ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్, డీజిల్ పై 80 పైసల చొప్పున దేశీయ చమురు కంపెనీలు పెంచాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో.. లీటరు పెట్రోలు ధర 110 రూపాయల 91 పైసలు, డీజిల్ రేటు 97 రూపాయల 23 పైసలకు చేరింది.

సిటీల వారీగా..

దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్  97 రూపాయల 81 పైసులు, డీజిల్ ధర 89 రూపాయల 7 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ 112 రూపాయల 51 పైసలు, డీజిల్ 96 రూపాయల 70 పైసలకు పెరిగింది. చెన్నైలో పెట్రోల్ 103 రూపాయల 67 పైసలు,  డీజిల్ 93 రూపాయల 71 పైసలుగా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ 106 రూపాయల 34 పైసలు, డీజిల్ 91 రూపాయల 42 పైసలకు పెరిగింది.

నాలుగు రోజుల్లోనే రూ.2.40

దేశంలో గతేడాది నవంబర్ 4 తర్వాత తొలిసారిగా ఈ నెల 22న పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నాలుగురోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు 2 రూపాయల 40 పైసల చొప్పున పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో... చమురు కంపెనీలు లీటరు డీజిల్ పై 13 రూపాయల 10 పైసల నుంచి 24 రూపాయల 90 పైసల వరకు,పెట్రోల్ పై 10 రూపాయల 60 పైసల నుంచి 22 రూపాయల 30 పైసల వరకు పెంచే అవకాశముందని అంచనా వేస్తున్నాయి వ్యాపార వర్గాలు.