ఓటేసి వచ్చేసరికి బంగారం, నగదు చోరీ ..    నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణంలో ఘటన

ఓటేసి వచ్చేసరికి బంగారం, నగదు చోరీ ..    నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణంలో ఘటన

మక్తల్, వెలుగు: ఓటేసి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగిన ఘటన నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్​పట్టణంలోని శబరి కాలనీలో అద్దెకు ఉంటున్న విజయభాస్కర్ రెడ్డి ఓ షోరూంలో పని చేస్తున్నాడు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఓటు వేసేందుకు కుటుంబసభ్యులతో పోలింగ్​సెంటర్​కు వెళ్లాడు. ఓటు వేసి ఇంటికొచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని రూ.2.50 లక్షలు, 2 తులాల బంగారం కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకొని ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.