ఇండియాపై కామెంట్స్‌: పీఎం ఒలీ రాజీనామా కోరిన పార్టీ

ఇండియాపై కామెంట్స్‌: పీఎం ఒలీ రాజీనామా కోరిన పార్టీ
  • పీఎం కామెంట్స్‌ సరైనవి కావన్న సీనియర్‌‌ నేతలు

ఖాట్మాండూ: నేపాల్‌ మ్యాప్‌ను ఉపసంహరించుకున్న తర్వాత ఇండియా తనను పదవి నుంచి తొలగించాలని ప్రయత్నాలు చేస్తోందని నేపాల్‌ ప్రధాని కేపి శర్మ ఒలి కామెంట్‌ చేసిన నేపథ్యంలో అధికార పార్టీ నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ సీనియర్‌‌ నాయకులు ఆయనపై సీరియస్‌ అయ్యారు. ఈ మేరకు ఆయన్ను రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధానిని తొలగించడానికి భారత్‌ కుట్ర చేస్తున్నట్లు ప్రధాని చేసిన కామెంట్స్‌ను రాజకీయ పరంగా, దౌత్యపరంగా కూడా తగినవి కాదని మాజీ ప్రధాని ప్రచండ అన్నారు. ఒలీ చేసిన కామెంట్స్‌పై స్టాండింగ్‌ కమిటీ మీటింగ్‌ నిర్వహించిన తర్వాత ఈ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అలాంటి స్టేట్‌మెంట్స్‌ పొరుగుదేశాలతో రిలేషన్స్‌ దెబ్బతింటాయి అని ప్రచండ వార్నింగ్‌ ఇచ్చారు. నేపాల్‌ కొత్త మ్యాప్‌ను అప్రూవ్‌ చేసినందుకు తనని పదవి నుంచి దించాలని, ఎంబసీస్‌, హోటల్స్‌లో ప్రయత్నాలు చేస్తున్నారని, నేపాల్‌కు చెందిన లీడర్స్‌ కూడా కుట్రలు చేస్తున్నారని ఒలీ ఆరోపించారు. కాగా.. ఒలీ చేసిన ఆరోపణలకు సాక్షాలు చూపించాలని సీనియర్‌‌ నేతలు డిమాండ్‌ చేశారు.