మీ యూనిఫార్మ్ గౌరవాన్ని కాపాడండి: మోడీ

మీ యూనిఫార్మ్ గౌరవాన్ని కాపాడండి: మోడీ

న్యూఢిల్లీ: ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ప్రొబేషనర్స్ తమ యూనిఫార్మ్ పై గర్వపడాలని, దాని గౌరవాన్ని ఎప్పుడూ కోల్పోకుండా చూడాలని ప్రధాని మోడీ చెప్పారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ‘దిక్షంత్ పరేడ్ ఈవెంట్’లో మోడీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐపీఎస్ ప్రొబేషనర్స్ తో ప్రధాని ఇంటరాక్ట్ అయ్యారు. పలు విషయాల గురించి తన అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు.

‘మీ వృత్తిలో అకస్మాత్తుగా దేన్నయినా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేకసార్లు వస్తాయి. దీనికి మీరు సంసిద్ధులై అప్రమత్తంగా ఉండాలి. విపరీతమైన ఒత్తిడి కూడా ఉంటుంది. టీచర్ లాంటి ఎవరినైనా కలవండి. ఎవరి సూచనలకు మీరు గౌరవమిస్తారో వారిని మీట్ అవుతూ ఉండండి’ అని మోడీ సూచించారు. తమ యుక్త వయస్సులోనే టెర్రరిజం లాంటి తప్పుడు దారి వైపు వెళ్లకుండా దేశ యువతను నియంత్రించాలన్నారు. తాను తరచూ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ను కలుస్తుంటానని, అయితే కరోనా కారణంగా ఈమధ్య కాలంలో కుదరడం లేదని పేర్కొన్నారు. అయితే తన పదవీ కాలంలో మిమ్మల్ని తప్పక కలుస్తానని ప్రొబేషర్స్ ను ఉద్దేశించి మోడీ హామీ ఇచ్చారు. ఈ ఏడాది 131 మంది ఐపీఎస్ ప్రొబేషనర్స్ 42 వారాల బేసిక్ కోర్సు ఫేస్-1 ట్రెయినింగ్ ను ఎన్ పీఏలో పూర్తి చేసుకున్నారు. వీరిలో 28 మంది మహిళా ప్రొబేషనర్స్ ఉన్నారు.