ద.మ రైల్వేలో కొత్త టీసీ విధానం

ద.మ రైల్వేలో కొత్త టీసీ విధానం
  • ఏహెచ్​హెచ్​టీ సిస్టమ్​తో టికెట్ చెకింగ్

సికింద్రాబాద్, వెలుగు:  చార్టులతో సీట్ల రిజర్వేషన్లను తనిఖీలు చేసే టీసీ వ్యవస్థలో కొత్త విధానాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రవేశపెట్టింది. ఇక నుంచి అడ్వాన్స్​డ్ హ్యాండ్​హెల్డ్​ టెర్మిల్స్(ఏహెచ్ హెచ్ టీ) విధానంలో టీసీలు ఖాళీ బెర్తులు, సీట్ల కేటాయింపును పరిశీలించనున్నారు. 16  సూపర్​ఫాస్ట్​ రైళ్లలో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రిజర్వ్​చేసుకున్న ప్యాసింజర్ల లిస్ట్​తో పాటు, ఖాళీ బెర్తుల స్టేటస్​ను చూసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.