క్రేజీ క్రేజీగా ‘పర్సనలైజ్డ్ జువెలరీ’

క్రేజీ క్రేజీగా ‘పర్సనలైజ్డ్ జువెలరీ’

ఆడవాళ్లకు జువెలరీ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గోల్డ్, ఆర్టిఫిషియల్.. ఏ నగలైనా సరే నచ్చితే చాలు కొనేస్తుంటారు. అందులోనూ ఈ మధ్య ‘పర్సనలైజ్డ్‌‌ జువెలరీ’ ట్రెండ్‌‌గా మారింది. ఎవరికి నచ్చినట్టు వాళ్లు నగలను డిజైన్‌‌ చేయించుకుంటున్నారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, జాబ్ చేసేవాళ్లు స్టైలిష్ గా కనిపించేందుకు ఇలాంటి జువెలరీ ఎక్కువగా వాడుతున్నారు. వాటిలో నేమ్ పెండెంట్స్, ఫింగర్‌‌‌‌ రింగ్స్‌‌పై నేమ్స్ ట్రెండ్‌‌ అవుతున్నాయి.

స్పెషల్‌‌గా..

ఈ కాలంవాళ్లు ముఖ్యంగా గిఫ్ట్స్‌‌ ఇచ్చేందుకు నేమ్ పెండెంట్స్, రింగ్స్ ఎంచుకుంటున్నారు. జువెలరీ షోరూమ్‌‌లలో ఆర్డర్‌‌‌‌పై నగలు చేయించుకోవడం తెలిసిందే. అయితే.. అదే తరహాలో లెటర్స్‌‌తో, నేమ్స్‌‌తో చైన్స్ కస్టమైజ్ చేసిన నగలు ఆన్‌‌లైన్‌‌లో దొరుకుతున్నాయి. వీటితో పాటు ఫింగర్‌‌‌‌ రింగ్స్‌‌, బ్రేస్‌‌లెట్స్, ఇయర్ రింగ్స్, మంగళ సూత్రాలు ఇలా అన్ని నగలకు ఆల్ఫాబెటికల్‌‌ అందాలు అద్దుతున్నారు. చాలామంది అబ్బాయిలు కూడా బ్రేస్‌‌లెట్స్, ఫింగర్ రింగ్స్ డిజైన్‌‌ చేయించుకుంటున్నారు.
ఆన్‌‌లైన్‌‌లో కస్టమైజ్డ్ జ్యువెలరీ అని సెర్చ్‌‌ చేయగానే ఇవి అందుబాటులో ఉండే వెబ్‌‌సైట్స్ వచ్చేస్తున్నాయి. వాటిలో డిజైన్ సెలెక్ట్ చేసుకుని నేమ్ సెండ్ చేస్తే చాలు చెప్పిన టైంకి డెలివరీ అయిపోతుంది. అంతేకాదు ఈ జువెలరీ కలర్‌‌‌‌ కొంచెం కూడా షేడ్‌‌ కాదు.
ఎందుకంటే వీటిని 18 క్యారెట్ గోల్డ్‌‌తో తయారు చేస్తున్నారు. ఇవి 1500 రూపా యల నుంచి అందుబాటులో ఉంటున్నాయి.