న్యూజీలాండ్ లో మసీదులు మూసివేత.. కస్టడీలో నలుగురు

న్యూజీలాండ్ లో మసీదులు మూసివేత.. కస్టడీలో నలుగురు
  • క్రైస్ట్ చర్చ్ లో వరుసగా రెండు మసీదుల్లో దుండగుల కాల్పులు
  • పోలీసుల కస్టడీలో నలుగురు.. వారిలో ఓ మహిళ
  • మసీదుల్లో రక్తపు మడుగులో మృతదేహాలు.. వారి మధ్య చిన్నారులు

క్రైస్ట్ చర్చ్ సెంట్రల్ సిటీలోని మూడు మసీదుల్లో ఆగతంకులు జరిపిన కాల్పులతో న్యూజీలాండ్ లో హై అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం ప్రేయర్ లో భాగంగా ముస్లింలు మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్న టైమ్ లో కొందరు దుండగులు తుపాకులు, బాంబులతో తెగబడ్డారు. ప్రార్థనలు చేస్తున్న ముస్లింలపై విచక్షణ లేకుండా కాల్పులు జరిపారు. బాంబులు వేశారు. సిటీలోని అల్ నూర్ మసీదు, లిన్ వుడ్ మసీదుల్లో పదుల సంఖ్యలో దుండగులు కాల్పులు జరిపినట్టు పోలీసులు చెప్పారు.

8 మంది చనిపోయినట్టు చెబుతున్నారు. వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. మొత్తం నలుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది.

దుండగులు అక్కడికి వచ్చిన వాహనాల్లో పోలీసులు.. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజెస్(ఐఈడీ పేలుడు పదార్థాలు) ను కనుగొన్నారు. వాటిని సీజ్ చేశారు.

రెండు మసీదుల్లో వరుసగా ఆగంతకులు కాల్పులు జరపడంతో… న్యూజీలాండ్ పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. శుక్రవారం వేళ ప్రార్థనలను నిలిపివేయాలని ఆదేశించారు. దేశంలోని అన్ని మసీదులను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు.