మూడు నెలలుగా జీతాలు లేవు: ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం జేఏసీ

మూడు నెలలుగా జీతాలు లేవు: ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం జేఏసీ
  • వేతనాలు వెంటనే చెల్లించి, తమను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం)లో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం జేఏసీ తెలిపింది. దీంతో జీతం మీదనే ఆధారపడి బతుకుతున్న ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు సకాలంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

180 రోజుల పెయిడ్ మెటర్నిటీ లీవ్స్, 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని తక్షణమే అమలు చేయాలని జేఏసీ అధ్యక్షుడు డా. మహేందర్ రావు పుట్టా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశంలోని 7 రాష్ట్రాల్లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేశారని, కాంగ్రెస్ పాలిత ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యోగ భద్రత కల్పించారన్నారు. ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులర్ చేయాలని కోరారు.