జలంధర్ దాడుల సూత్రధారి అరెస్ట్

జలంధర్ దాడుల సూత్రధారి అరెస్ట్

వెలుగు‌‌‌‌‌‌‌‌: పంజాబ్‌ లోని జలంధర్‌‌‌‌‌‌‌‌లో గతేడాది నాలుగు గ్రెనేడ్‌‌‌‌ దాడులకు పాల్పడిన అమీర్‌‌‌‌‌‌‌‌ నజీర్‌‌‌‌‌‌‌‌ ను ఎన్ఐఏ బుధవారం అదుపులోకి తీసుకుంది. జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతీపూర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతానికి చెందిన అమీర్‌‌‌‌‌‌‌‌ ఆ దాడుల కేసులో ప్రధాన నిందితుడని అధికారులు వెల్లడించారు. అతడికి అన్సార్‌‌‌‌‌‌‌‌ ఘజ్వాత్‌‌‌‌ ఉల్‌‌‌‌హింద్‌‌‌‌ టెర్రర్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన నిందితుల్లో ఇద్దరు ఇప్పటికే ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో చనిపోగా.. మరో ఇద్దర్ని ఎన్‌‌‌‌ఐఏ అరెస్టు చేసింది. ఈ టెర్రరిస్టులు గతేడాది సెప్టెంబరు 14న జలంధర్ లో పోలీసులపై దాడి చేశారు. ఆ ఘటనకు అన్సార్‌‌‌‌‌‌‌‌ ఘజ్వాత్‌‌‌‌ ఉల్‌‌‌‌హింద్‌‌‌‌ టెర్రర్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌ కారణమని గుర్తించిన ఎన్‌‌‌‌ఐఏ.. దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసింది.